వరద బాధితులకు రామోజీ గ్రూప్ చేయూత - మహబూబాబాద్‌లో నిత్యావసర సరుకుల పంపిణీ - Ramoji Group Helps Flood Victims - RAMOJI GROUP HELPS FLOOD VICTIMS
Published : Sep 6, 2024, 10:01 PM IST
Ramoji Group Helps Mahabubabad Relief Flood Victims : ప్రకృతి వైపరీత్యాలతో సర్వస్వం కోల్పోయి నిరాశ్రయులైన వారికి చేయూతనందిస్తూ, వారికి అండగా నిలుస్తున్న "ఈనాడు " యాజమాన్యం సేవలు అభినందనీయమని జిల్లా ఉద్యాన శాఖ అధికారి మరియన్న, మరిపెడ సీఐ రాజ్ కుమార్ గౌడ్ చెప్పారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల, మరిపెడ మండలం సీతారాం నాయక్ తండా వరద బాధితులకు బాసటగా నిలిచింది ఈనాడు. కార్పొరేట్ సామాజిక బాధ్యతగా 'ఈనాడు మీతోడు' అంటూ నిత్యావసరాలతో కూడిన కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది.
రావిరాలలో 120, సీతారాం నాయక్ తండాలో 50 మందికి సరుకు కిట్లను అందించింది. ఊహించని వరదల్లో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన వారికి నిత్యావసర సరుకులను అందించడంపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఈనాడులో ప్రచురించిన మానుకోట-గుండెకోత కథనం చూసి దాతులు ఎందరో సాయం చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వరంగల్ ఈనాడు యూనిట్ సర్క్యలేషన్ ఇంఛార్జి శ్రీనివాస్, ఎస్సైలు రమేశ్ బాబు, సంతోశ్, సతీష్ గౌడ్, ఎంపీడీవో బాలరాజు తదితరులు పాల్గొన్నారు.