ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నారా రామ్మూర్తినాయుడు అంతిమయాత్ర - ప్రత్యక్షప్రసారం - RAMAMURTHY NAIDU LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 17, 2024, 12:32 PM IST

Updated : Nov 17, 2024, 3:53 PM IST

Ramamurthy Naidu Live : సీఎం చంద్రబాబు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడు అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని ఆదివారం ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు. నేడు స్వస్థలం నారావారిపల్లెలో మధ్యాహ్నం 3 గంటల తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తల్లిదండ్రులు అమ్మణ్నమ్మ, ఖర్జూరనాయుడు అంత్యక్రియలు జరిగిన ప్రాంతంలోనే రామ్మూర్తి అంతిమసంస్కారాలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు. లోకేశ్​ను, ఇతర కుటుంబసభ్యులను పరామర్శిస్తున్నారు. 1994లో టీడీపీ తరఫున చంద్రగిరి నుంచి పోటీ చేసిన రామ్మూర్తినాయుడు కాంగ్రెస్‌ అభ్యర్థి గల్లా అరుణకుమారిపై విజయం సాధించారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2003లో దిల్లీలో అప్పటి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ సమక్షంలో రామ్మూర్తినాయుడు ఆ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ హైకమాండ్ 2004లో శ్రీకాళహస్తి నుంచి పోటీ చేయాలని ఆదేశించడంతో విభేదించారు. అనంతరం చంద్రగిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిచెందారు.
Last Updated : Nov 17, 2024, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details