చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం - పూర్ణాహుతి కార్యక్రమంతో పరిసమాప్తం - Yagam at Chandrababu house
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 18, 2024, 7:22 PM IST
Raja Shyamala Yagam at Chandrababu House Ended : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నినాసంలో మూడు రోజులుగా జరుగుతున్న రాజశ్యామల యాగం ముగిసింది. శుక్రవారం నాడు ఈ యాగం మొదలు కాగా నేటితో పూర్తయింది. మూడు రోజుల పాటు యాగం వైభవంగా జరిగింది. గుంటూరుకు చెందిన వేదపండింతులు పి. శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ఈ యాగం నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 50 మంది రుత్వికులు చంద్రబాబు, భువనేశ్వరి దంపతులతో పలు పూజా క్రతువులు చేయించారు.
మూడవ రోజు మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమంతో యాగం పరిసమాప్తమైంది. ఈ యాగంలో పార్టీ కార్యాలయ సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలసి పాల్గొన్నారు. కాగా చంద్రబాబు నాయుడు గతంలోనూ ప్రత్యేకంగా కొన్ని యాగాలు జరిపించిన అంశం అందరికీ తెలిసిందే. శత చండీయాగంతో పాటు, మహా సుదర్శన యాగం చేశారు. అయితే తాజాగా చేసిన రాజశ్యామల యాగం ద్వారా విజయం సిద్ధించేలా చేయమని శ్యామలా దేవిని ప్రసన్నం చేసుకున్నారని వేద పండితులు తెలిపారు.