సికింద్రాబాద్‌లో కుండపోత వర్షం- తాడ్‌బండ్ హనుమాన్ ఆలయంలో వరదనీరు - Rain Water Enters Into Temple - RAIN WATER ENTERS INTO TEMPLE
Published : May 7, 2024, 9:52 PM IST
Rain Water Enters Into Hanuman Temple : హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ తాడ్‌బండ్ హనుమాన్ దేవాలయంలోకి వర్షపునీరు చేరింది. ఇటీవల నూతనంగా నిర్మించిన ధ్వజస్తంభం పైకప్పు నుంచి వర్షపు నీరు పడుతుండటంతో ఆలయమంతా జలమయమయింది. వర్షం నీరు వరదలా వస్తుండడంతో హనుమాన్ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు పడ్డారు. ధ్వజస్తంభం గర్భగుడి చుట్టుపక్కల ఆలయ ప్రాంగణం వర్షపు నీటితో నిండింది. ఆలయ అధికారులు నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు.
Heavy Rains In Hyderabad : హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నిన్నటి వరకు భానుడి ప్రతాపంతో అల్లాడిన ప్రజలకు వర్షంతో కాస్త ఉపశమనం లభించింది. అయితే నగరంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. జీహెచ్ఎమ్సీ పరిధిలోని పటాన్చెరు, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, గచ్చిబౌలిలోని పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసింది. రహదారులపై వర్షంనీరు నిలిచిన చోట మ్యాన్‌హోల్స్‌ను తెరిచి నీటిని మళ్లిస్తున్నారు.