వారు రైలు ఎక్కేందుకు క్యూ పద్ధతి - విజయవాడ రైల్వేస్టేషన్లో అమలు - RAILWAY PASSENGERS QUEUE SYSTEM
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 29, 2024, 10:38 PM IST
RAILWAY PASSENGERS QUEUE SYSTEM START: భారతీయ రైల్వేలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక మార్పులు చేసుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ప్రయాణికుల నుంచి విమర్శలు ఎక్కువగా వస్తున్న జనరన్ బోగీలపై దక్షిణ మధ్య రైల్వే దృష్టి పెట్టింది. టిక్కెట్ లేకుండా ప్రయాణం చేసేవారిని అరికట్టడంతో పాటు, ప్రయాణికులు సౌకర్యంగా ప్రయాణించేందుకు తగు చర్యలు తీసుకుంటోంది.
జనరల్ బోగీలలో రైలు ఎక్కే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాంలపై క్యూలైన్ విధానాన్ని అమలు చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. రద్దీ ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్లలో జనరల్ బోగీలు వచ్చే ప్రాంతాల్లో ప్లాట్ ఫాంలపై క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు లైన్లో నిల్చొని ప్రశాంతంగా జనరల్ బోగీ ఎక్కే విధానాన్ని అమల్లోకి తెచ్చారు. విజయావాడ నుంచి బయలు దేరే పలు రైళ్లకు తొలుత ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. రద్దీ వేళల్లో ప్రయాణికులు జనరల్ బోగీ ఎక్కేందుకు తోపులాటలు, తన్నుకోవడం, పోటీలు పడటం లేకుండా, ప్రమాదాలు బారిన పడకుండా సీటులో కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఈ విధానంపై ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి వెంకట రమణ వివరించారు.