ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

జూన్​ 4 వరకు టీడీపీ నేతలు అప్రమత్తంగా ఉండాలి- పులివర్తిని పరామర్శించిన రఘురామ - Raghu Rama Meet Nani in House

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 16, 2024, 8:05 PM IST

Raghu Rama Krishna Raju Meet Pulivarti Nani in Tirupati: తిరుపతిలో పులివర్తి నానిపై జరిగిన దాడి ద్వారా వైసీపీ ఓటమిని అంగీకరించినట్లుగా ప్రజలు భావిస్తున్నారని టీడీపీ ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు అన్నారు. వైసీపీ మూకల దాడిలో గాయపడిన పూలివర్తి నానిని ఆయన పరామర్శించారు. తిరుపతిలోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడారు. జూన్​ 4వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. నానిపై ఇంత దారుణంగా దాడి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ దాడి నుంచి ఆయన తృటిలో ప్రాణాలను కాపాడుకోవటమనేది అత్యంత దారుణమైన పరిస్థితన్నారు. జూన్​ 4న ఫలితాలు వెలువడిన సాయంత్రం నుంచి వైసీపీలోనే అంతర యుద్ధం మొదలవుతుందని రఘురామ అన్నారు. 

రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో వైసీపీ ఇక కనిపించదన్నారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచీ ప్రజలు ఓటేసేందుకు తరలివచ్చారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి చేసిన అన్యాయాలను గుర్తించిన మహిళలు భారీగా పోలింగ్‌లో పాల్గొన్నారని వ్యాఖ్యానించారు. జన స్పందనతో పోలింగ్‌ రోజు మధ్యాహ్నానికే వైసీపీ నాయకులు తిరుగుముఖం పట్టారని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details