గురజాలలో చంద్రబాబు 'రా కదలి రా' సభ- భారీ ఏర్పాట్లు చేస్తోన్న టీడీపీ శ్రేణులు - Yarapathineni Srinivas Rao
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 29, 2024, 5:47 PM IST
Ra Kadali Ra Arrangements At Gurajala: పల్నాడు జిల్లా గురజాలలో మార్చి రెండో తేదీన జరగనున్న "రా కదలిరా" సభను (Meeting) విజయవంతం చేయాలని గురజాల మాజీ ఎమ్మెల్యే (Former MLA) యరపతినేని శ్రీనివాసరావు కోరారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandra babu) హాజరయ్యే ఈ సభ స్థలాన్ని, ఏర్పాట్లను (Meeting Arrangements) టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి యరపతినేని పరిశీలించారు.
Yarapathineni Srinivas Rao Observes Ra Kadali Ra Arrangements: ఈ సందర్భంగా యరపతినేని మాట్లాడుతూ రానున్న ఎన్నికల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో రా కదలిరా సభలు చంద్రబాబు నిర్వహిస్తున్నారని అందులో భాగంగానే పల్నాడు జిల్లా నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తున్నట్లు యరపతినేని తెలిపారు. గురజాల నియోజకవర్గం నుంచి ఈ సభకు దాదాపు 60 నుంచి 70వేల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నామని యరపతినేని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి భారీ ఎత్తున ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.