ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం నష్టపోయింది - అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం : పురందేశ్వరి - Purandeswari fire on ycp government - PURANDESWARI FIRE ON YCP GOVERNMENT

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 3, 2024, 5:40 PM IST

Purandeswari Angry With YCP Government : వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురందేశ్వరి విమర్శించారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేయడంలో జగన్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కూటమి నేతలతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గడిచిన ఐదేళ్లుగా రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ఎక్కడ చూసిన అవినీతి, అక్రమాలే రాజ్యమేలుతున్నాయని మండిపడ్డారు. దానిని నిరసిస్తూనే ప్రజలు ఈ రక్షాస ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 

బ్లేడ్ బ్యాచ్​లకు, మాఫియా దందాలకు రాజమహేంద్రవరం పెట్టింది పేరని పురందేశ్వరి ఎద్దేవా చేశారు. ఇక్కడ జరుగుతున్న ఇసుక మాఫియా వల్ల ఇసుక ధరలు పెరిగిపోయి నిర్మాణ రంగంమీద ఆధారపడి బతుకుతున్న 35 లక్షల మంది రోడ్డున పడ్డారని మండిపడ్డారు. రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలో అన్ని రకాల సమస్యలు గుర్తించామని తెలిపారు. వీటన్నింటిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని పురందేశ్వరి హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details