ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో సైకో వీరంగం - వైద్యులు, సిబ్బందిపై దాడికి యత్నం - Psycho Halchal in Govt Hospital - PSYCHO HALCHAL IN GOVT HOSPITAL

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 27, 2024, 1:34 PM IST

Psycho Halchal in Adoni Government Hospital at Kurnool District : కర్నూలు జిల్లా ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. దీంతో అతడిని వైద్య సిబ్బంది పట్టుకొని ఓ స్తంభానికి కట్టేశారు. వివరాల్లోకి వెళితే ఆదోని మండలంలోని ఆరెకల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మతిస్థిమితం లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం తీసుకువచ్చారు. దీంతో అతను ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్య పరికరాలు, ఫ్యాన్లు, ఫర్నిచర్లను ధ్వంసం చేశాడు. 

అక్కడ ఉన్న రాడ్డుతో వైద్యులు, సిబ్బందిపై దాడి చేసేందుకు అతను యత్నించాడు.  ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది, రోగులు వెంటనే ఆ వ్యక్తిని పట్టుకొని ఓ స్తంభానికి కట్టేశారు. గత మూడు రోజుల నుంచి మతిస్థిమితం లేదని వైద్యం కోసం తీసుకొచ్చామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ సైకో చేసిన చేష్టలకు అక్కడ ఉన్న రోగులు, వైద్య సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సైకో ఆసుపత్రిలో విలువైన వైద్య పరికరాలను ధ్వంసం చేసినట్లు వైద్యులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details