సిటీ సెంటర్లుగా మారనున్న రైల్వేష్టేషన్లు- ఈ నెల 26న ప్రధాని మోదీ శంకుస్థాపన - గుంటూరు రైల్వే డివిజన్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 23, 2024, 7:07 PM IST
PM Modi laid foundation stone for Railway development works : గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులకు ఈ నెల 26న ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నట్లు డీఆర్‌ఎం రామకృష్ణ తెలిపారు. డివిజన్ పరిధిలోని 13 రైల్వే స్టేషన్లను 221 కోట్ల రూపాయలతో ఆధునీకరించనున్నట్లు ఆయన తెలిపారు. అదే రోజున డివిజన్ పరిధిలోని పలు ఆర్‌వోబీలు, ఆర్‌యూబీలకు కూడా మోదీ శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది రైల్వే బడ్జెట్ లో 9వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించారని అన్నారు. స్టేషన్ అధునికీకరణ పనులు మాస్టర్ ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్లు తెలిపారు. రైల్వేష్టేషన్లను సిటీ సెంటర్ల మాదిరిగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.
మాస్టర్ ప్లాన్ ప్రకారం,ప్రయాణికుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టాం. మాస్టర్ ప్లాన్లో స్టేషన్లను సిటీ సెంటర్లుగా అభివృద్ధి చేపట్టాం. తద్వారా స్టేషన్లలో షాపింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నాం. స్టేషన్లకు బస్ కనెక్టివిటీ కూడా కల్పించడం జరిగింది. - రామకృష్ణ, గుంటూరు డీఆర్‌ఎం