ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: పార్లమెంట్ బడ్జెట్​ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు లైవ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2024, 10:31 AM IST

Updated : Jan 31, 2024, 12:35 PM IST

President Draupadi Murmu speech at Parliament Live: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఎన్నికలకు ముందు బడ్జెట్ సమావేశాలు కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రసుత లోక్​సభకు ఇవే చివరి సమావేశాలు కావడంతో కొత్త భవనంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను సమర్పించి తాత్కాలిక బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు.  ఈరోజు నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నారు. శీతాకాల సమావేశాల్లో జరిగిన ఘటనల నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

మొదటి రెండు రోజుల పాటు జీరో అవర్, ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేశారు. ఫిబ్రవరి రెండో తేదీన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ జరగనుంది. కేంద్ర బడ్జెట్​తో పాటు రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్ము, కాశ్మీర్​లకు వేర్వేరుగా బడ్జెట్​లను కూడా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. కాగా లోక్‌సభలో 146 మంది సస్పన్షన్‌లను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు ముందు జరిగే చివరి సమావేశం కావడంతో వాడీవేడీ చర్చలు జరిగే అవకాశముంది. కాగా కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి ప్రత్యక్ష ప్రసారం మీకోసం..

Last Updated : Jan 31, 2024, 12:35 PM IST

ABOUT THE AUTHOR

...view details