LIVE : ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా - ట్యాంక్‌బండ్ వద్ద ఎయిర్ షో - PRAJA PALANA VIJAYSTOVALU LIVE
Published : Dec 8, 2024, 4:30 PM IST
|Updated : Dec 8, 2024, 4:57 PM IST
Praja Palana Vijayotsavalu Live : ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు ఇవాళ ఎయిర్ షో ఘనంగా జరుగుతోంది. భారత వాయుసేనకు చెందిన తొమ్మిది సూర్యకిరణ్ విమానాలు విన్యాసాలు చేస్తున్నాయి. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఎయిర్ షోను చూసేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాత్రి 7 గంటలకు రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ కాన్సర్ట్ జరగనుంది. నెక్లెస్ రోడ్డులో ఫుడ్, హస్తకళల స్టాళ్లు రేపటి వరకు కొనసాగుతాయి. బిర్యానీ, చాట్, ఐస్‌క్రీం, తెలంగాణ, ఉత్తరాది ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేశారు. రాజీవ్ గాంధీ విగ్రహం, ఎన్టీఆర్ స్టేడియం, ఫుడ్ ఓవర్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన స్టేజీల వద్ద నేడు, రేపు సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. సోమవారం సచివాలయంలో తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. సుమారు లక్ష మంది మహిళలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు.
Last Updated : Dec 8, 2024, 4:57 PM IST