ఎండల తీవ్రతల్లోనూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ అభ్యర్థి బుచ్చిబాబు - Political campaigns in Hot Weather - POLITICAL CAMPAIGNS IN HOT WEATHER
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 24, 2024, 4:23 PM IST
Political campaigns in Hot Weather in konaseema District : ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో కోనసీమ జిల్లాలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సూర్యుని ప్రతాపం ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఎవరు కూడా బయటకు రావడం లేదు. ఎండలు మండిపోవడంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి సైతం భయపడుతున్నారు. దీంతో మధ్యాహ్నం నుంచే వ్యాపారులు దుకాణాలు మూసేస్తున్నారు. రెండు రోజులుగా 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో యానం పర్యాటక ప్రాంతం వెలవెలబోతోంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కూడా ఆగడం లేదు.
ముమ్మిడివరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బుచ్చిబాబు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాల ప్రయోజనాలు వివరిస్తున్నారు. అంత ఎండల ప్రచారం చేస్తుండడంతో గ్రామస్థులు పూర్తిగా సహకరిస్తున్నారు. మరి కొన్ని చోట్ల ప్రచారాలు వెలవెలబోతున్నాయి. కొందరి ప్రచారాలకు వెళ్లలేని ప్రజలు ఎండ కారణంగా ఇళ్లలోనే ఉంటున్నారు.