ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రైలులో బంగారం తరలింపు, 10మంది అరెస్టు- 6.92కేజీలు స్వాధీనం - బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 2, 2024, 10:25 AM IST

Police seized The Gold was Being Smuggled: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా గూడూరు నుంచి రైలులో బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ముందుగా వచ్చిన సమాచారంతో సీఐ శ్రీనివాస్‌ సిబ్బంది కలిసి గురువారం తెల్లవారుజామున భీమవరం టౌన్‌ రైల్వే స్టేషన్‌ రోడ్డులో బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతున్న 10మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ రవి ప్రకాష్‌ తెలిపారు. భీమవరం రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ. 3కోట్ల 84లక్షలు ఉంటుందని తెలిపారు.

నిందితుల నుంచి 6కేజీల 92గ్రాముల బంగారం, 49 వేల 970 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టుబడిన వారిలో తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన చిలకల సాయికిరణ్‌, చిలకల అరవింద్‌, వీరసాయి, రాజమహేంద్రవరానికి చెందిన కోళ్ల వెంకట కాంతారావు తదితరులు ఉన్నారు.  వీరంతా నెల్లూరు జిల్లా గూడూరు నుంచి రాజమహేంద్రవరానికి బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో తనిఖీలు ఉంటాయని భీమవరం రైల్వే స్టేషన్‌లో దిగి రోడ్డు మార్గాన వెళ్లడానికి యత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ABOUT THE AUTHOR

...view details