వైసీపీ నేత అనుచరుడి ఇంట్లో భారీగా మద్యం బాటిళ్లు - స్వాధీనం చేసుకున్న పోలీసులు - Liquor Bottles YCP Activist house - LIQUOR BOTTLES YCP ACTIVIST HOUSE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 8, 2024, 6:45 PM IST
Police Seized Liquor Bottles at YCP Activist House: ఎన్నికల వేళ ముందస్తుగా మద్యం నిల్వ చేసుకునేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం జోలాపుట్లో వైసీపీ నాయకుడి అనుచరుడి ఇంట్లో భారీగా మద్యం పట్టుకున్నారు. ఎన్నికల కోసం ముందస్తుగా ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో మద్యం నిల్వ ఉంచారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. వైసీపీ నాయకుడి అనుచరుడి ఇంట్లో భద్రపరిచిన 120 మద్యం బాక్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కర్నూలులోని పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న ఒక వాహనంలో 240 బాక్సుల మద్యాన్ని సెబ్ అధికారులు సీజ్ చేశారు. అనంతరం ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు. ఎన్నికల వేళ రాష్ట్రంలో మద్యం, డబ్బు పంపిణీలు జోరుగా కొనసాగుతాయని అధికారులు ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. కానీ అధికార పార్టీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు తరచూ ప్రయత్నిస్తూనే ఉంటున్నారు.