సత్ఫలితాలిస్తున్న 'మొబైల్ హంట్' - వాట్సప్‌లో మెసేజ్ చేస్తే మిస్సైన మీ ఫోన్ ఎక్కడున్నా దొరికే ఛాన్స్ - Police Recovery Was Stolen Phones - POLICE RECOVERY WAS STOLEN PHONES
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 22, 2024, 10:04 AM IST
Police Recovery Was Stolen Phones in Nellore District: నెల్లూరు జిల్లాలో సుమారు కోటి 50 లక్షల రూపాయలు విలువ చేసే 600 సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. పోగొట్టుకున్న, చోరీకి గురైన ఈ ఫోన్లను మొబైల్ హంట్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందజేశామని ఆ జిల్లాల ఎస్పీ ఆరిఫ్ హపీజ్ తెలిపారు. ఇప్పటివరకు ఆరు విడతల్లో 5 కోట్ల 85 లక్షల రూపాయలు విలువ చేసే 2 వేల 320 ఫోన్లను రికవరీ చేశామని తెలిపారు. మొబైల్ హంట్ సేవలు సత్ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు.
మొబైల్ హంట్‌తో (Mobile Hunt) పాటు సీఈఐఆర్ సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కేవలం వాట్సప్‌లో మెసేజ్ ద్వారా సమాచారం ఇస్తే ఫోన్లు రికవరీ చేసే బాధ్యత తాము తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. పోగొట్టుకున్న తమ మొబైల్ ఫోన్లను గుర్తించి అప్పగించిన సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సెల్ఫోన్లు రికవరీ కోసం శ్రమించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.