ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు - పోలీసుల అదుపులో 22మంది - visakha spa center raid

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 14, 2024, 3:45 PM IST

Police Raids On Spa Center at Gajuwaka: స్పా సెంటర్ పేరుతో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు చేపడుతున్న మూడు సెంటర్ల​పై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అందులో ఉన్న ఏడుగురు యువకులు, 15 మంది అమ్మాయిలను పోలీసులు అదుపులోకి (custody) తీసుకున్నారు. యువతలను పెందుర్తిలో ఉన్న హోమ్​కి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖ గాజువాకలో నిబంధనలకు విరుద్ధంగా బ్యూటీ స్పా పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఈరోజు పోలీస్ కమీషనర్ ఆదేశాలతో గాజువాక పోలీసులు మూడు స్పా సెంటర్లపై దాడులు చేసి అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్ల పేరుతో ఆసాంఘిక కార్యకలాపాలు (illegal activities) నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

ఇటీవల విజయవాడలో ఆరు స్పా సెంటర్ల పైన జరిపిన దాడులలో థాయిలాండ్​కు చెందిన ముగ్గురు విదేశీ మహిళలతో పాటు 24 మంది మహిళలకు విముక్తి కల్పించడంతో పాటు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేందుకు వచ్చిన 25 మంది పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పా సెంటర్ ముసుగులో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఐదుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. 

ABOUT THE AUTHOR

...view details