ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ర్యాగింగ్​ ఘటనలో ఆరుగురు పూర్వ విద్యార్థులపై కేసు నమోదు - Ragging in SSN College Hostel - RAGGING IN SSN COLLEGE HOSTEL

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 25, 2024, 3:38 PM IST

Ragging in SSN College Hostel in Palnadu : పల్నాడు జిల్లా నరసరావుపేట ఎస్​ఎస్​ఎన్​ (SSN) కళాశాల హాస్టల్​లో ర్యాగింగ్‌ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఫిబ్రవరి నెలలో ర్యాగింగ్ పేరుతో కొందరు సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను కర్రలతో చితకబాదిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసింది. వీడియో ఆధారంగా ఘటనపై హాస్టల్ విద్యార్థులను పోలీసులు విచారించారు. ఈ మేరకు ర్యాగింగ్​కు పాల్పడిన ఆరుగురు పూర్వ సీనియర్ విద్యార్థులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ (CI) కృష్ణారెడ్డి తెలిపారు. వీరిలో ఒకరిని అదుపులోకి తీసుకున్నామన్నారు.  

ఈ ఘటన గత ఫిబ్రవరి నెల 2వ తేదీన జరిగినట్లు అప్పటి జూనియర్ విద్యార్థులు విచారణలో పోలీసులకు వివరించారు. ఈక్రమంలో ర్యాగింగ్ కు పాల్పడ్డ ఆరుగురు పూర్వ సీనియర్ విద్యార్ధులపై కేసులు నమోదు చేసినట్లు నరసరావుపేట ఒకటో పట్టణ సీఐ చింతల కృష్ణారెడ్డి మీడియాకు వివరించారు.  ఈ క్రమంలో కేసు నమోదు చేసిన విద్యార్థుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
 

ABOUT THE AUTHOR

...view details