రూ.కోటి 20 లక్షల విలువైన నకిలీ మద్యం ధ్వంసం - Excise Police about Drugs
Published : Feb 3, 2024, 5:13 PM IST
|Updated : Feb 3, 2024, 10:47 PM IST
Police Demolished Illegal Wine : రూ.కోటి 20 లక్షల విలువ గల నకిలీ మద్యాన్ని ఇవాళ హయత్ నగర్ ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. ఒడిశా నుంచి రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న నకిలీ మద్యాన్ని 2022 డిసెంబర్లో హయత్ నగర్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ సుమారు 3 వేల లీటర్ల నకిలీ మద్యాన్ని జేసీబీ(JCB) సాయంతో ఎక్సైజ్ శాఖ అధికారులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా సరూర్ నగర్ ఎక్సైజ్ డివిజన్ అధికారి రవీందర్ రావు మాట్లాడారు.
Excise Police about Drugs : ఓ బెల్టుషాపులో దొరికిన చిన్న క్లూతో పెద్ద ఎత్తున నకిలీ మద్యాన్ని పట్టుకున్నామని ఎక్సైజ్ డివిజన్ అధికారి రవీందర్ రావు తెలిపారు. నకిలీ మద్యం, గంజాయి, గంజాయి చాక్లెట్స్ అక్రమంగా తరలిస్తున్న క్రమంలో వాటిపై పటిష్ఠ నిఘా పెట్టామని చెప్పారు. మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. బెల్ట్ షాపులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి అక్రమ మద్యాన్ని ఎట్టి పరిస్థితిలో సహించేది లేదని అన్నారు.