ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రెక్కీ చేసి తాళం వేసిన ఇళ్లు చూసి మరీ - పోలీసులకు చిక్కిన దొంగలు - Police Arrested Two Thieves - POLICE ARRESTED TWO THIEVES

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 31, 2024, 5:06 PM IST

Police Arrested Two Thieves in West Godavari Recovered Huge Gold & Silver : రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పశ్చిమగోదావరి జిల్లా తణుకు గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 47 లక్షల రూపాయలు విలువైన 600 గ్రాముల బంగారు ఆభరణాలు, 13 కిలోల వెండి ఆభరణాలు, చోరీలకు ఉపయోగిస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేరస్తుల అరెస్టు వివరాలను తణుకు గ్రామీణ సీఐ నాగేశ్వరరావు మీడియాకు వివరించారు. నేరస్తులు ఇద్దరు ముందు రెక్కీ నిర్వహించి తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి చోరీలకు పాల్పడుతున్నారని తెలిపారు. 15 నేరాలకు సంబంధించి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వీరు దొంగతనాలు చేశారని పోలీసులు తెలిపారు. పకడ్బందీగా ప్రణాళిక వేసుకుని దొంగతనాలు చెయ్యడమే వీరి ప్రవృత్తి అని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details