ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మదనపల్లి హత్య కేసులో ఏడుగురు అరెస్ట్​ - రిమాండ్‌కు తరలింపు - Police Arrested Seven Accused - POLICE ARRESTED SEVEN ACCUSED

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 31, 2024, 7:34 PM IST

Police Arrested Seven Accused in Murder Case at Madanapally: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈ నెల 25న జరిగిన హత్య కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీవారి నగర్‌లో ఉంటున్న పుంగనూరు శేషాద్రి అలియాస్ శేషు అనే వ్యక్తిని అతని ప్రత్యర్థులు అతి దారుణంగా హతమార్చారు. హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి వెల్లడించారు. మదనపల్లి పట్టణం గొల్లపల్లి చెందిన కొండుపల్లి ఆనంద్, శేషు ఇద్దరు కలిసి ప్లాట్ల వ్యాపారం చేసేవారని డీఎస్పీ తెలిపారు. ఆ తర్వాత వేరుగా ఈ వ్యాపారం చేసుకోగా అందులో శేషు త్వరగా ఎదుగుతున్నాడనే కారణంతో ఆనంద్ తన అనుచరులతో కలిసి శేషు ఇంటికి వెళ్లి తలుపులు, మారణాయుధాలతో హత్య చేశాడని అన్నారు. దీనిపై అప్పట్లో రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. అయితే నిందితులు అమ్మచెరువుమిట్ట కూడలిలో ఉన్నట్లు సమాచారం రాగా వెంటనే పోలీసులు అక్కడ చేరుకుని ఏడుగురిని అరెస్టు చేశారని తెలిపారు. వీరిని రిమాండ్​కు పంపిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details