LIVE : కోల్‌కతాలో అండర్ వాటర్ మెట్రో టన్నెల్‌ను ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ - Kolkata Underwater Metro Tunnel
Published : Mar 6, 2024, 10:22 AM IST
PM Modi Inaugurate Underwater Metro Tunnel in Kolkata LIVE : దేశంలో మెుట్టమెుదటి నీటి అడుగున నడిచే మెట్రో రైలు ప్రారంభోత్సవం జరుపుకుంటోంది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో తొలి అండర్ వాటర్ మెట్రో టన్నెల్‌ను బుధవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తున్నారు. కోల్‌కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ కింద హుగ్లీ నది దిగువన ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. దాదాపు 120 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందిన ఈ అండర్ వాటర్ మెట్రో టన్నెల్ హావ్‌డా మైదాన్ నుంచి ఎస్‌ప్లనాడె స్టేషన్ మధ్యలో ఉంది. 520 మీటర్ల పొడవు ఉన్న ఈ సొరంగాన్ని 45 సెకన్లలో దాటే మెట్రో రైలు ప్రయాణికులకు కొత్త అనుభూతిని అందించనుంది. సొరంగ అంతర్గత అడ్డుకొలత 5.55 మీటర్లు కాగా బాహ్య అడ్డుకొలత 6.1 మీటర్లగా ఉంది. ఈ సొరంగమార్గం నదీగర్భానికి 13 మీటర్ల దిగువన, భూమిలోపలికి 33 మీటర్ల దిగువన ఉంది. కోల్‌కతా ఈస్ట్ వెస్ట్ కారిడార్‌కు ఈ సొరంగ నిర్మాణం చాలా కీలకమని అధికారులు తెలిపారు. హావ్‌డా-సీల్దా నడుమ రోడ్డు ప్రయాణానికి ప్రస్తుతం గంటన్నర సమయం పడుతోందని, ఈ మెట్రో మార్గం ఏర్పాటుతో అది 40 నిమిషాలకు తగ్గుతుందన్నారు. ఈ కారిడార్ల పరిధిలో ఎస్‌ప్లనాడె, మహాకారణ్, హావ్ డా, హావ్ డా మైదాన్ వంటి ముఖ్యమైన స్టేషన్లున్నాయి.