జనం లేక వెలవెలబోయిన జగన్ ఎన్నికల ప్రచార సభ - సీఎం మాట్లాడుతుండగానే ఇంటిబాట - NO PUBLIC TO CM JAGAN MEETING - NO PUBLIC TO CM JAGAN MEETING
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 10, 2024, 2:15 PM IST
People Not interest CM Jagan Meeting in Mangalagiri Guntur District : గుంటూరు జిల్లా మంగళగిరిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ జనం లేక వెలవెలబోయింది. జగన్ ప్రసంగిస్తుండనేగా మధ్యలో జనం ఇంటిబాట పట్టారు. వారిని ఆపేందుకు పోలీసులు బారికేడ్లు పెట్టినా పట్టించుకోకుండా వెళ్లిపోయారు. సభకు వచ్చిన వారికి కనీస సదుపాయాలు కూడా కల్పించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం జగన్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సామాన్యులకు ఇక్కట్లు తప్పడం లేదు. జిల్లాలో జగన్ పర్యటిసున్నారు అంటే చాలు అధికారులు మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తూనే ఉంటారు. భద్రత పేరుతో చెట్లను నరికి వేయడం, విద్యుత్ వైర్లను తొలగించడం, ట్రాఫిక్ ఆంక్షలతో ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితే మంగళగిరి వాసులకు ఎదురైంది. సభ నిర్వహించే ప్రాంతంలో విద్యుత్ ఆపేయడం వల్ల ఇటు ప్రజలు, అటు దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బ్యాంకులు సైతం మూసివేశారు.