Students Get Emotional While Teacher Retirement in Ramabhadrapuram : ఉపాధ్యాయులు, విద్యార్థులకు మధ్య ఉండే అనుబంధమే వేరు. తల్లిదండ్రుల తర్వాత వారి గురించి బాగా తెలిసిన వాళ్లు టీచర్లే. వాళ్లకేం కావాలి, వారు ఏం చెయ్యగలుగుతారు, ఎలా తీర్చిదిద్దాలని ప్రతి నిత్యం కృషి చేస్తారు. అలాంటి వారితో పిల్లలు చాలా కనెక్ట్ అవుతారు. ప్రతీ వ్యక్తికి విద్యార్థి దశలో ఓ గురువు మార్గదర్శకంగా ఉంటారు, అలాగే ఒక ఫేవరెట్ టీచర్ ఉంటారు. వారిని జీవితాంతం మర్చిపోలేరు.
వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని పాఠశాల విడిచి వెళ్తున్న టీచర్‌ను వెళ్లొద్దంటూ విజయనగరం జిల్లా రామభద్రపురంలో విద్యార్థులు బోరున విలపించారు. విద్యార్థులను సముదాయించలేక ఉపాధ్యాయురాలు కన్నీరుపెట్టారు. రామభద్రపురంలోని పూడివీధి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయగౌరి వచ్చే మార్చిలో జరిగే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఇందుకోసం ఆమె వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు.
'ఆకాశంలో ఆశల హరివిల్లు' - ఆ తల్లీకూతుళ్లను అభినందించకుండా ఉండరు!
ఆమె పాఠశాల నుంచి వెళ్తుండగా తమను విడిచి వెళ్లొదంటూ విద్యార్ధులు వేడుకున్నారు. చిన్నారుల కన్నీరు చూసి ఆమె కూడా దుఃఖం ఆపులేకపోయారు. పదవీ విరమణ పొందినా పాఠశాలకొచ్చి మీ బాగోగులు చూసుకుంటునంటూ విద్యార్ధులను ఓదార్చారు. విజయగౌరి 2023 జూన్ నుంచి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా ఆమె పని చేస్తున్నారు. క్రీడా పోటీలు, జాతీయ పండుగల వేడుకలు, వివిధ ప్రాజెక్టు కృత్యాల్లో విద్యార్ధులను వారి అభిరుచికి అనుగుణంగా ప్రోత్సహించటం ద్వారా ఆమెతో అనుబంధం పెరిగింది.
డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలి : సీఎం చంద్రబాబు