టీడీపీలో చేరారని కుళాయి కనెక్షన్ కట్- వైఎస్సార్సీపీ సర్పంచ్ పైశాచికత్వం - People Fire on YSRCP Surpanch - PEOPLE FIRE ON YSRCP SURPANCH
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 9, 2024, 7:10 PM IST
People Fire on YSRCP Surpanch in Prakasam District : వైఎస్సార్సీపీ నేతల పైశాచికత్వం రోజు రోజుకీ పెరిగిపోతుంది. అసలే నీరందక ప్రజలు అల్లాడిపోతుంటే ఓ నేత కావాలని నీటి కుళాయిలు నిలిపివేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రకాశం జిల్లా అర్ధవీడులో వైఎస్సార్సీపీ సర్పంచ్ వసంతమ్మపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. ఆదివారం 30 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. దీంతో ఆగ్రహించిన సర్పంచ్ వసంతమ్మ వారికి మంచినీరు రాకుండా నీటి కుళాయిలను తొలగించారు. దీంతో వారు సర్పంచ్ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.
సర్పంచ్ వసంతమ్మ మాత్రం ఈ ప్రాంతంలో నీరు వృధాగా పోతుందని అందుకే ఆ రెండు కుళాయిలు తొలగించామని చెబుతున్నారు. ఇన్ని రోజులు వృధా కాలేదా టీడీపీలో చేరాకే నీరు వృథాగా పోతుందనిపిస్తుందా అని ప్రజలు సర్పంచ్‌ను నిలదీశారు. తాము టీడీపీలో చేరామని కక్ష కట్టుకుని నీళ్లు రాకుండా చేశారంటూ స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.