'జై బోలో చంద్రన్న' ఆనందంతో పెన్షన్ లబ్దిదారుడు డాన్స్ - Pensioner Dance in Guntur District - PENSIONER DANCE IN GUNTUR DISTRICT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 1, 2024, 4:27 PM IST
Pensioner Dance in Guntur District : పెన్షన్ల పెంపుపై లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఒకేసారి 7వేల రూపాయలు పెన్షన్ అందుకోవడంతో గుంటూరు జిల్లాలో లబ్ధిదారుడి ఆనందానికి అవధుల్లేవు. ఆనందంతో ఓ వ్యక్తి నృత్యం చేశాడు. ప్రజాప్రతినిధులు అందించిన పెన్షన్ డబ్బులు చేతిలో పట్టుకుని రోడ్డుపై ఉత్సాహంగా ఆడి పాడాడు. జై బోలో చంద్రబాబు, జై చంద్రన్న అంటూ ఆనందంతో గంతులేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పింఛను అందించారు. పెండింగ్ బకాయిలు కలిపి 7వేల రూపాయల చొప్పున ఫించన్లు అందజేయడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్య కారులు, కళాకారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్‌జెండర్స్ వంటి వారికి ఇకపై 4వేల రూపాయల పింఛను అందజేస్తున్నారు. దివ్యాంగులకు రూ. 3వేల నుంచి ఒకేసారి 6 వేలు చేయగా, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి రూ. 5 వేలు నుంచి 15వేలు ఇస్తున్నారు.