ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పారిశ్రామిక వేత్తలు ఇచ్చిన కరోనా విరాళాలు రూ. 240 కోట్లు అవినాష్ రెడ్డికి ఇచ్చారు: పెమ్మసాని చంద్రశేఖర్ - Pemmasani Comments on YS Jagan - PEMMASANI COMMENTS ON YS JAGAN

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 4, 2024, 10:42 PM IST

Pemmasani Chandra Sekhar Fire on Jagan : కరోనా సమయంలో పారిశ్రామిక వేత్తలు ఇచ్చిన 240 కోట్ల రూపాయలు అవినాష్ రెడ్డి వద్ద ఉన్నాయని గుంటూరు పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్ధి నసీర్ తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పెమ్మసాని, కరోనా సమయంలో పేదలకు వైద్యం అందించేందుకు పారిశ్రామిక వర్గాలు విరాళాలు ఇస్తే సీఎం వాటిని అవినాష్ రెడ్డికి అందించడమేంటని పెమ్మసాని ప్రశ్నించారు. ఆ డబ్బును బీనామీలకు పంచిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 

దీనిపై ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని లెక్కలు బయటకు తిస్తామని హెచ్చరించారు. అలాగే అధికారం కోసం జగన్ మోహన్ రెడ్డి ఎంతకైన తెగిస్తాడనని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు చేసే కుట్రలను ప్రజలు గమనించాలని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి అధికారంలోకి రావాలని పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details