ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

హైదరాబాద్​లో జనసేన శ్రేణుల​ సంబరాలు - పవన్​కల్యాణ్​ గెలుపుతో ఆనందంలో అభిమానులు - Pawan Kalyan Win in Pithapuram - PAWAN KALYAN WIN IN PITHAPURAM

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 4, 2024, 3:29 PM IST

Pawan Kalyan Won JanaSena Leaders Celebrated in Hyderabad: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్​లో కూటమి నేతలు విజయఢంకాను మోగిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలకు అంతుచిక్కని విజయాన్ని అందించే దిశగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో కూటమి నేతలు విజయం సాధించడంతో జనసేన, టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కూటమి విజయానికి రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా సంబరాలతో హోరెత్తిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్​లో కూటమి విజయ దుందుబి మోగించడంతో తెలంగాణలోని హైదరాబాద్‌లో జనసేన నేతల సంబరాలు మిన్నంటాయి. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయం 69,169 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. దీంతో హైదరాబాద్ నగరంలోని జనసేన కార్యాలయంలో కార్యకర్తలు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పార్టీ అధ్యక్షుడు రాధారం రాజలింగం నేతృత్వంలో పార్టీ కార్యాలయానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్ నిలువెత్తు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేస్తూ నినాదాలు చేశారు. పవన్ కల్యాణ్ కృషితో కొత్తగా ఏర్పాటవుతున్న ప్రభుత్వానికి రాధారం రాజలింగం శుభాకాంక్షలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details