ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'పవన్ అఖండ మెజారిటీతో గెలవాలి'- జనసేన కార్యకర్త పొర్లుదండాలు - Pawan Fan Prayers At Tirumala - PAWAN FAN PRAYERS AT TIRUMALA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 1, 2024, 4:43 PM IST

Pawan Kalyan Fan Special Prayers At Tirumala  For Pithapuram Win : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని, పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అఖండ మెజారిటీతో విజయం సాధించాలని ఓ జనసేన కార్యకర్త వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈశ్వర్ అనే పవన్ కల్యాణ్‌ వీరాభిమాని తిరుపతిలోని జపాలి తీర్థానికి పొర్లు దండాలతో వెళ్లి మెుక్కులు చెల్లించారు. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఆకాశ గంగ జలాశయం మెట్ల వద్ద నుంచి జపాలి తీర్థం వరకూ పొర్లు దండాలతో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. 

ఈ నెల 4వ తారీఖున వెలువడే ఎన్నికల ఫలితాలలో కూటమితో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ భారీ మోజర్టీతో గెలుస్తారని ఈశ్వర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌ గెలుపుతో పిఠాపురం రూపరేఖలు మారిపోతాయని తెలిపారు. ఈ హనుమాన్ జయంతి నాడు ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ పవన్ కల్యాణ్‌​పై ఉంటాయని అన్నారు. అలాగే అధినేత ఎప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవున్ని ప్రార్థించినట్లు ఈశ్వర్ తెలిపారు. ఈశ్వర్​కు పవన్ కల్యాణ్‌ ​పై ఉన్న అభిమానాన్ని చూసి అక్కడి వారందరూ ఆశ్చర్య పోయారు.

ABOUT THE AUTHOR

...view details