Live : పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం - ప్రత్యక్ష ప్రసారం - RAJYA SABHA SESSIONS 2025 LIVE
Published : Jan 31, 2025, 11:03 AM IST
|Updated : Jan 31, 2025, 12:27 PM IST
Rajya Sabha Sessions 2025 LIVE : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంతో ఇవి ప్రారంభమవుతాయి. ఆ తర్వాత 2024-25కు సంబంధించిన ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశ పెడతారు. శనివారం కేంద్ర బడ్జెట్ను ఆమె సభకు సమర్పిస్తారు. బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా శుక్రవారం నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకూ జరుగుతాయి. తొలి విడత ఫిబ్రవరి 13వ తేదీ వరకూ, రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకూ జరుగుతాయి. నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశ పెట్టనుండటం వరుసగా ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. బడ్జెట్ సమావేశాల్లో పలు బిల్లులను కేంద్రం ప్రవేశ పెట్టే అవకాశముంది. కేంద్రం ప్రవేశ పెట్టనున్న బిల్లుల్లో 'ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇంటరెస్ట్స్ ఇన్ ఎయి ర్ క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్, త్రిభువన్ శాకరీ యూనివర్సిటీ, బ్యాంకింగ్, రైల్వేస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఆయిల్ ఫీల్డ్స్, 2025 ఫైనాన్స్ బిల్లు ఉన్నాయి. గత సమావేశాల్లో పెండింగ్లో పడిపోయిన మరో 10 బిల్లులూ ఈసారి సభకు రానున్నాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రస్తుతం రాజ్యసభ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Jan 31, 2025, 12:27 PM IST