ఉల్లిరైతులకు నష్టం కలగకుండా చర్యలు చేపడతాం: ఎమ్మెల్యే గౌరు చరిత
By ETV Bharat Andhra Pradesh Team
Published : 5 hours ago
Panyam MLA Gowru Charita Inspects Kurnool Onion Market : రైతులకు నష్టం జరగకుండా సాధ్యమైనంత మేర ఉల్లి కొనుగోలు చేయాలని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఆదేశించారు. రాష్ట్రంలో రైతుల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చరితా రెడ్డి అన్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ఎమ్మెల్యే మార్కెట్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రైతులను సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ పరిమితికి మించి సరుకు వస్తుండడంతో కొనుగోళ్లు ఆలస్యం అవుతుందని ఎమ్మెల్యే అన్నారు. పరిస్థితి ఉన్నతాధికారులు, మంత్రి దృష్టికి తీసుకెళ్లి మరో మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకుని వస్తామన్నారు. అనంతరం వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు, లారీ యజమానులు, మార్కెట్ యార్డ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటికే కొనుగోలు చేసిన ఉల్లిని త్వరగా తరలించాలన్నారు. రైతులు సులువుగా ఉల్లి విక్రయించేలా ఏర్పాట్లు చేపడుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ సెక్రటరీ జయలక్ష్మి పాల్గొన్నారు.