ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

గత పాలకుల నిర్లక్ష్యం - వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేక మునిగిన పొలాలు - Farmers problems due to heavy rains - FARMERS PROBLEMS DUE TO HEAVY RAINS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 16, 2024, 9:55 PM IST

Paddy Crops Were Waterlogged Due to Heavy Rains in Krishna District : కృష్ణా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వరి నారుమడులు నీట మునిగాయి. మెువ్వ మండలంలోని పెదపూడి, కోసూరు,పెదముత్తేవి గ్రామాల్లో ఎక్కువ శాతం రైతులు బోర్లు వేసుకుని విద్యుత్ మోటార్లతో వరి పంట సాగు చేస్తుంటారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఐదేళ్లుగా కాలువలను బాగు చేయలేదు. కాలువల్లో ఎక్కడ చూసినా గడ్డితో నిండి ఉంది. దీంతో వర్షపు నీరు బయటకు వెళ్లక కొద్దిపాటి వర్షాలకే పొలాలు నీట మునిగిపోతున్నాయని రైతులు ఆవేదవ వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన తప్పులకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లెేదని రైతులు వాపోయారు.    

అయితే నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు కొండ వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులతో పాటు సాధారణ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా పూర్తి చేయకపోవడంతో రోడ్లపైనే వర్షపు నీరు నిలిచిపోయింది. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉందో తెలియక ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details