ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తాగునీటి సమస్యతో రోడ్డెక్కిన ఒంగోలు వాసులు - Ongole People Strike on Road

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 3, 2024, 5:56 PM IST

Ongole People Strike on Road Due to Water Issue: తాగునీటి సమస్య తీర్చాలంటూ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో మహిళలు రోడ్డెక్కారు. దోర్నాల మండలం తిమ్మాపురం ఎస్సీ పాలెంలో నీటి సమస్య పరిష్కరించాలంటూ శ్రీశైలం ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. ఖాళీ బిందెలతో రహదారిపై మహిళలు బైఠాయించగా, వారికి మద్దతుగా స్థానిక యువత తప్పెట్లు కొడుతూ నిరసన తెలియజేశారు. 15 రోజుల నుంచి ట్యాంకర్లు నిలిపివేయడంతో నీటి సమస్య జటిలమైందని వాపోయారు. అధికారులు స్పదించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

నీటి ట్యాంకర్ల బిల్లలు చెల్లించకపోవడంతోనే ఈ దుస్థితి :   కొన్ని రోజుల క్రితం: నాలుగున్నర ఏళ్లుగా పెండింగ్​లో ఉన్న నీళ్ల ట్యాంకర్ల బిల్లులు వెంటనే విడుదల చేయాలని ప్రకాశం జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళన చేశారు. బిల్లులను వెంటనే విడుదల చేయకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని నాయకులు హెచ్చరించారు. యర్రగొండపాలెం పెద్దారవీడు మండలంలోని హనుమాన్ జంక్షన్ వద్ద నీటి బిల్లులను విడుదల చేయాలంటూ ఐదు మండలాలకు చెందిన వైసీపీ నాయకులు రహదారిపై ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత నాలుగున్నర ఏళ్లుగా లక్షలకు లక్షలు అప్పులు తెచ్చి గ్రామాల్లో నీళ్లు తోలుతున్నా బిల్లులు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. కనీసం ఇళ్లు గడవడానికి కూడా కష్టంగా మారిందని ,ట్రాక్టర్ల సైతం అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details