ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

యూజర్​ ఛార్జీల పేరుతో అధికారుల బెదిరిస్తున్నారు: నున్న మ్యాంగో మార్కెట్‌ వ్యాపారుల ఆవేదన - Nunna Mango Association on AMC - NUNNA MANGO ASSOCIATION ON AMC

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 4, 2024, 9:06 PM IST

Nunna Mango Growers Association on AMC Officers: ఆసియాలోనే అతిపెద్ద మామిడి ఎగుమతి కేంద్రాల్లో ఒకటైన విజయవాడ గ్రామీణం నున్న మ్యాంగో మార్కెట్​పై ఏఎంసీ (Agriculture Marketing Committee) అధికారులు యూజర్ ఛార్జీలు పేరుతో తమపై భారం మోపటానికి యత్నిస్తున్నారని రైతులు, వ్యాపారులు ఆరోపించారు. అంతేగాక వాలెంటరీ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని నున్న మ్యాంగో మార్కెట్ వ్యాపారులు, రైతులు మండిపడుతున్నారు. 

మార్కెట్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళుతున్న లారీలను ఏఎంసీ అధికారులు అడ్డుకొని, వెంటనే డబ్బులు కట్టకుంటే లారీలను సీజ్ చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. సుమారు పది వేల మందికిపైగా ఈ మార్కెట్లో పని చేస్తూ లబ్ధి పొందుతున్నారని, వారందరి భవిష్యత్​ ప్రశ్నార్ధకంగా మారే విధంగా అధికారులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు గతంలో తమకు నోటీసులు జారీ చేస్తే, తాము తిరిగి సమాదానం చెప్పామని, అయినప్పటికీ అధికారులు లారీలను ఆపి బెదిరిస్తున్నారని వాపోయారు. అధికారుల తీరును నున్న మ్యాంగో మార్కెట్ గ్రోవర్స్ అసోసియేషన్ నాయకులు తీవ్రంగా ఖండించారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని మార్కెట్ అసోసియేషన్ సభ్యులు కోరారు.

ABOUT THE AUTHOR

...view details