అధికారంలోకి వచ్చాక అమ్మఒడికి నయా రూల్స్ అంతా మామయ్య మాయే - Nellore People Fire On Jagan - NELLORE PEOPLE FIRE ON JAGAN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 17, 2024, 4:43 PM IST
Nellore People Fire On Jagan Ammavodi : అమ్మఒడి పథకంలోనూ జగన్ మార్కు మోసం చేశారు. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే వారిద్దరికీ 15వేల చొప్పున ఇస్తానంటూ హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక నాలుక మడతేశారు. ఎంతమంది పిల్లల్ని బడికి పంపినా ఒక్కరికే ఇస్తామంటూ మెలిక పెట్టారు. పోనీ వారికైనా సక్రమంగా ఇచ్చారా అంటే అదీ లేదు. 300 యూనిట్ల విద్యుత్ వాడకం దాటితే అనర్హులుగా తేల్చారు. అడ్డగోలు నిబంధనలతో అమ్మఒడి పథకంలో కోత వేశారంటూ నెల్లూరు జిల్లాలో లబ్ధిదారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Parents Fires on Ammavodi Rules : ఇవ్వని అమ్మఒడి ఇచ్చామని అబద్దాలు చెప్పి, తప్పుడు పాంప్లెట్లు పంచుతున్నారని ప్రజలు ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకే ఓటు వేసి చంద్రబాబు నాయుడిని గెలిపించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ ఎన్నికల ముందు ఒక మాట అధికారం వచ్చాక మరో మాట చెప్పి మోసం చేశారని నెల్లూరు వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.