ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మెల్‌బోర్న్‌లో మహాకూటమి విజయోత్సవాలు- అక్షర యోధుడు రామోజీరావుకు నివాళులు - NDA Success Celebrations Australia - NDA SUCCESS CELEBRATIONS AUSTRALIA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 16, 2024, 12:37 PM IST

NDA Success Celebrations in Australia Melbourne : ఆస్ట్రేలియా దేశంలోని మెల్‌బోర్న్‌లో మహాకూటమి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. తెలుగుదేశం మెల్బోరన్‌ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సినీనటుడు శివాజీ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రకటించిన లక్ష ఉద్యోగ అవకాశాలను అమలు చేయాలని శివాజీ పిలుపునిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో వైఎస్సార్సీపీ చేస్తోన్న దుశ్చర్యలను సమర్ధంగా తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇదే వేదికపై రామోజీ గ్రూపు సంస్థ ఛైర్మన్‌ రామోజీరావు సంస్మరణ కార్యక్రమాన్ని జరిపారు. రామోజీరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు.

రామోజీరావు ప్రస్థానాన్ని- విజయాలను గుర్తు చేసుకుంటూ రూపొందించిన లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. మెల్బోరన్‌ టీడీపీ విభాగం అధ్యక్షుడు లగడపాటి సుబ్బారావు, ఉపాధ్యక్షుడు నంబళ్ల గోపి, ప్రధాన కార్యదర్శి ముప్పనేని రాం, ఇతర సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో తెలుగుదేశంతోపాటు బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

ABOUT THE AUTHOR

...view details