విశాఖలో ఆర్టీసీ కార్మికుల నిర్బంధం - రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ఎమ్యూఏ ఆందోళన - NMUA Protest Take Action on DPTO
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 30, 2024, 3:32 PM IST
National Mazdoor Union Assiociation Protest in Ongole: విశాఖలో రిలే దీక్షలో ఉన్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు నిర్బంధించడంపై ఎన్ఎమ్యూఏ ఆందోళనకు చేపట్టింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏపీఎస్ ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ అసోసియేషన్ యూనియన్ (NMUA) 129 డిపోల్లో ధర్నా చేస్తున్నామని తెలిపాయి. దీనికి కారణమైన విశాఖ డీపీటీఓ (District Public Transport Officer)పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒంగోలు బస్టాండ్ వద్ద కార్మిక సంఘాలు నిరసన చేపట్టారు. అలాగే కౌన్సిలింగ్ పద్ధతిలో కండక్టర్, డ్రైవర్ డ్యూటీ చార్టులు వేయాలని కోరారు.
NMUA Protest Take Action against DPTO: విశాఖలో 17 రోజులుగా రిలే దీక్షలో ఉన్న ఆర్టీసీ కార్మికులను డీపీటీఓ ఎస్పీతో కలిసి పోలీస్ స్టేషన్కు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఆటంకం కలిగిస్తారనే ఉద్దేశంతో రాత్రికి రాత్రే నాయకులను అరెస్టు చేయించారని మండిపడ్డారు. డీపీటీఓపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ధర్నా చేస్తున్నామని ఎన్ఎమ్యూఏ నాయకుడు తెలిపారు.