ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి మంగళగిరికి ఏం చేశావు - మేము అధికారంలోకి రాగానే డీఎస్సీ నోటిఫికేషన్‌: లోకేశ్​ - Nara Lokesh on MLA Alla Ramakrishna - NARA LOKESH ON MLA ALLA RAMAKRISHNA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 1, 2024, 10:58 AM IST

Nara Lokesh fire on MLA Alla Ramakrishna Reddy: పదేళ్లు మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణా రెడ్డి ప్రజలకు ఏం మంచి చేశారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ నిలదీశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి కరకట్ట కమల్‌హాసన్‌ అని సామాజిక మాధ్యమం "ఎక్స్‌" ద్వారా ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కొత్తగా కట్టిందేమీ లేకపోయినా పేదల ఇళ్లు కూలగొట్టి రాక్షసానందం పొందారని మండిపడ్డారు. తాను ఐటి మంత్రిగా ఉన్నప్పుడు మంగళగిరి ఏపీఐఐసీ(APIIC) ఐటీ పార్కులో ఏర్పాటుచేసిన పరిశ్రమలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం వెళ్లగొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలోకి ఉన్నా కూడా మంగళగిరికి ఒక ఐటీ పరిశ్రమను రప్పించి 150 మందికి ఉపాధి కల్పించానని గుర్తుచేశారు. సొంత నిధులతో ప్రభుత్వానికి సమాంతరంగా 29 సంక్షేమ పథకాలు అందిస్తున్నాని తెలిపారు.

అధికారంలోకి రాగానే డీఎస్సీ నోటిఫికేషన్: తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో టిడ్కో గృహాలు, తాడేపల్లి మహానాడు ప్రాంతంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. గత ప్రభుత్వం టిడ్కో గృహాలు నిర్మిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చాక అరకొర వసతులు కల్పించి లబ్ధిదారులకు ఇచ్చిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details