స్కూబా డైవింగ్‌తో లోకేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు - TNSF Pranav Gopal lokesh wishes
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 23, 2024, 1:54 PM IST
Nara Lokesh Birthday Wishes By TNSF President Pranav Gopal: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదినం పురస్కరించుకుని టీఎన్ఎస్ఎఫ్ (Telugu Nadu Student Federation) అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలియజేశారు. విశాఖ సాగర గర్భంలో నారా లోకేష్ చిత్రపటంతో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
TDP Secretary Lokesh Wishes in Visakhapatnam: స్కూబా డైవింగ్‌తో విశాఖ సాగర జలాల అడుగు భాగంలో నారా లోకేశ్ చిత్ర పటాన్ని ప్రదర్శించారు. నారా లోకేష్‌పై ఉన్న అభిమానం, ప్రేమతో సరికొత్తగా జన్మదిన శుభాకాంక్షలు తెలపాలనే ఉద్దేశంతో ఈ సాహసోపేతమైన ప్రక్రియ చేపట్టానని ప్రణవ్ గోపాల్ తెలిపారు.
అమరావతి: నారా లోకేశ్‌కు రాజధాని రైతు పులి చిన్నా కృష్ణానదిలో వంద అడుగుల ప్లెక్సీని పడవల మధ్య ఊరేగిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. నది మధ్య పడవలలో ఫ్లెక్సీని ఊరేగిస్తూ జై లోకేషన్ అంటూ నినాదాలు చేశారు. కృష్ణానది తీరంలో పసుపు రంగు పొగ బాంబులతో అభిమానులు సందడి చేశారు.