ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఏపీ క్యాంపస్​ను సందర్శించిన నారా భువనేశ్వరి - Nara Bhuvaneshwari visit NTR School - NARA BHUVANESHWARI VISIT NTR SCHOOL

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 29, 2024, 3:13 PM IST

Nara Bhuvaneshwari visited NTR Model School In Krishna District : సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పాగోలులో పర్యటించారు. ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఏపీ క్యాంపస్​ను పరిశీలించారు. సిబ్బంది, టీడీపీ నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. విద్యార్థులు, సిబ్బందిని ఆప్యాయంగా పలకరించి వారితో ఫొటోలు దిగారు. విద్యార్థులతో భువనేశ్వరి ముచ్చటించారు. అనంతరం స్ఫూర్తిదాయక ప్రసంగం చేయడమే కాకుండా వారితో కలిసి భోజనం చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించాలని నారా భువనేశ్వరి సూచించారు. 

ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 400 మంది అనాథలు, పేద పిల్లల‌కు ఉచితంగా నాణ్యమైన విద్య, వ‌స‌తిని ఎన్టీఆర్ మోడ‌ల్ స్కూల్ కల్పిస్తోంది. ఎన్టీఆర్ విగ్రహానికి భువనేశ్వరి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. సిబ్బందితో ఆత్మీయంగా మాట్లాడి ఫొటోలు దిగారు. పిల్లలంద‌రినీ ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తూ హ‌త్తుకున్నారు. పిల్లలకు అందిస్తున్న సౌక‌ర్యాల గురించి నారా భువనేశ్వరి ఆరా తీశారు. 

ABOUT THE AUTHOR

...view details