కష్టకాలంలో రాజమహేంద్రవరం ప్రజలు ఎంతో ఆదరించారు - 53 రోజులు మరువలేనివి: నారా భువనేశ్వరి - Nara Bhuvaneshwari at Rajahmundry - NARA BHUVANESHWARI AT RAJAHMUNDRY
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 30, 2024, 3:40 PM IST
Nara Bhuvaneshwari Started NTR Trust Blood Bank in Rajamahendravaram : రాజమహేంద్రవరం ప్రజలు తనకు కుటుంబసభ్యులతో సమానమని, వారి రుణం తీర్చుకోలేనిదని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నగరంలోని ప్రకాశ్‌నగర్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ సౌజన్యంతో బ్లడ్‌బ్యాంక్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యాక రాజమహేంద్రవరంలోనే ఉన్నానని, ఆ 53 రోజులు మరువలేనన్నారు. తనతో పాటు కుటుంబసభ్యులకు ఎంతో ధైర్యమిచ్చి ముందుకు నడిపించారని చెప్పారు.
కష్టకాలంలో రాజమహేంద్రవరం ప్రజలు చూపిన ఆదరాభిమానాలు మర్చిపోలేనివని కొనియాడారు. అలాంటి ప్రాంతంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సేవలు ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. తెలుగుదేశం కూటమి ఎన్నికల్లో విజయం సాధించటం అంటే రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్రం వచ్చినట్టేనని ఆమె అభివర్ణించారు. తెలుగు ప్రజలకు భవిష్యత్తులోనూ విస్తృత సేవలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అందిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను ఆమె వివరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సంజీవని మొబైల్ క్లినిక్‌నూ సైతం భువనేశ్వరి ప్రారంభించారు.