ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మహిళా శ్రామిక శక్తితో నారా భువనేశ్వరి భేటీ - ప్రత్యక్ష ప్రసారం - Mata Mantri program Live - MATA MANTRI PROGRAM LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 23, 2024, 9:53 AM IST

Updated : Mar 23, 2024, 10:45 AM IST

Nara Bhuvaneshwari Mata Mantri program Live:  తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి,  మహిళా శ్రామిక శక్తితో మాటామంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రంలో మహిళల సమస్యలు, స్వావలంబన, ఆర్థికాభివృద్ధి తదితర అంశాలపై చర్చించనున్నారు. ఆయా రంగాల్లోని మహిళలు పడుతున్న ఇబ్బందులపై ఆమె చర్చిస్తారని తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు అరెస్ట్ అనంతర పరిణామాలతో, నారా భువనేశ్వరి టీడీపీ అధికార కార్యక్రమాలతో పాటుగా పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ మహిళా విభాగం నేతలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా నిజం గెలవాలి అనే కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్ అనంతరం పరిమాణాలతో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను సైతం పరామర్శిస్తూ వారికి ధైర్యం చెప్పడంతో పాటుగా, పార్టీ తరపున ఆర్థిక సహాయం చేస్తున్నారు. వారి పిల్లల చదువుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మహిళ శామిక శక్తిపేరుతో వారితో సమావేశమై వారి సమస్యలపై స్పందిస్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి. 
Last Updated : Mar 23, 2024, 10:45 AM IST

ABOUT THE AUTHOR

...view details