నాగార్జున సాగర్ 24 గేట్లు ఎత్తివేత - నిండుకుండను తలపిస్తున్న జలాశయం - Nagarjuna Sagar 24 gates lifting
Published : Sep 9, 2024, 4:41 PM IST
NAGARJUNA SAGAR: నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుంచి భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతుంది. రెండు లక్షల పై చిలుకు క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వస్తుంది. నాగార్జున సాగర్ జలాశయం 24 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేరకు ఎత్తి 1,90,128 క్యూసెక్కుల నీటిని స్పిల్వే నుంచి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయం మొత్తం నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588.30 అడుగులకు చేరింది. సాగర్ నీటి నిల్వ సామర్థ్యం మొత్తం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 306.98 టీఎంసీలుగా ఉంది.
సాగర్ కుడి ఎడమ కాల్వ లకు 10 వేల క్యూసెక్కుల సాగు నీరు విడుదల చేస్తున్నారు.ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుండి 29 వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుంది. నాగార్జున సాగర్ నిండుకుండను తలపిస్తోంది. నాగార్జున సాగర్ గేట్లు పలుమార్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.