ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'విద్యుత్​ కొనుగోళ్లలో కమీషన్ల కక్కుర్తి- అప్రకటిత కోతలతో జనం అవస్థలు' - Brahmam On Power Cuts In AP - BRAHMAM ON POWER CUTS IN AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 10, 2024, 5:10 PM IST

Nadendla Brahmam On Power Cuts In AP : రాష్ట్రంలో విద్యుత్‌ కోతలతో ప్రజలు, పారిశ్రామిక వేత్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుగుదేశం ఆందోళన వ్యక్తం చేసింది. జగన్‌ అసమర్థ నిర్ణయాలే ప్రస్తుత పరిస్థితికి కారణమని ఆ పార్టీ నాయకుడు నాదెండ్ల బ్రహ్మం ఆరోపించారు. కోతల్లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.

Nadendla Brahmam On Current  Bills : ఎండలు ముదరక ముందే అప్రకటిత కోతలతో జగన్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతోందని తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం మండిపడ్డారు. కమీషన్ల కోసం బహిరంగ మార్కెట్‌లో అధిక ధరల పెట్టి విద్యుత్​ను కొనుగోలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. 2019 నాటికి 2080 మెగావాట్ల మిగులు విద్యుత్​ను చంద్రబాబు జగన్​కు అప్పగించారని తెలిపారు. జగన్ కమీషన్ల కోసం విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై దాదాపు 20 వేల కోట్ల భారాలు మోపారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ప్రజా సమ్యల పట్ల చిత్త శుద్దిలేదని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details