ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

దూసుకుపోతున్న సెన్సెక్స్‌, నిఫ్టీ - స్టాక్‌ మార్కెట్ నిపుణుడు మూర్తి నాయుడుతో ముఖాముఖి - Stock Market Expert Murthy Naidu - STOCK MARKET EXPERT MURTHY NAIDU

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 3, 2024, 12:40 PM IST

Stock Market Expert Murthy Naidu Interview: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఆల్​ టైల్ హైరికార్డ్​ను క్రాస్ చేశాయి. లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ కూటమి భారీ విజయం సాధించవచ్చని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కనీవినీ ఎరుగని రీతిలో భారీ లాభాల్లో దూసుకుపోతున్నాయి. ఎర్లీ ట్రేడ్​లో సెన్సెక్స్​ ఏకంగా 2 వేల 777 పాయింట్లు లాభపడి 76 వేల 738 వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకింది. నిఫ్టీ 808 పాయింట్లు వృద్ధి చెంది 23 వేల 338 వద్ద లైఫ్​ టైమ్​ హైరికార్డ్​ను క్రాస్ చేసింది.

రికార్డు స్థాయి లాభాల్లో స్టాక్‌మార్కెట్లు కొనసాగుతున్నాయి. అన్ని రంగాల స్టాక్స్ కూడా లాభాల్లో దూసుకుపోతున్నాయి. ప్రధానంగా పవర్​గ్రిడ్, ఎన్​టీపీసీ, ఎల్​ అండ్ టీ, ఎస్​బీఐ, యాక్సిస్ బ్యాంక్​, భారతీ ఎయిర్​టెల్​లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకింగ్‌ షేర్లు భారీ లాభాల్లో  ఉన్నాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ బలపడింది. 42 పైసలు బలపడి 83 వద్ద రూపాయి మారకపు విలువ నమోదైంది.  స్టాక్‌ మార్కెట్‌ స్థితిగతులపై ఆర్ధిక రంగ నిపుణులు మూర్తి నాయుడుతో మా ప్రతినిధి ముఖాముఖి. 

ABOUT THE AUTHOR

...view details