ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అంతిమ సంస్కారానికీ అవస్థలే - శ్మశానవాటికకు వెళ్లాలంటే బురద దారే దిక్కు - Muddy Path to The Graveyard - MUDDY PATH TO THE GRAVEYARD

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 9, 2024, 2:01 PM IST

Funeral Problems in Eluru District : ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం పంచాయతీ వాడపల్లి కాలనీకి శ్మశాన వాటిక లేక పోవడంతో ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. కాలనీకి చెందిన ఉయికే రామకృష్ణ అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. పుంత దారి వర్షానికి దెబ్బ తినడంతో వాగులో నుంచే పాడే మోసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.  ఎవరైనా ఇంట్లో వారు చనిపోతే ఈ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని గ్రామస్థులు వాపోతున్నారు. అంతిమ సంస్కారానికి కూడా అవస్థలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మట్టి రోడ్డు చిన్న వర్షానికే బురద మయంగా మారి ప్రయాణాలు సమస్యాత్మకంగా మారి ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా కొంచెం పెద్ద వాన కురిస్తే దారులన్నీ వాగులను తలపిస్తున్నాయని తెలుపుతున్నారు. ఇప్పటికైనా తమకు పుంత దారులలో ఏర్పడుతున్న సమస్యలు పరిష్కరించాలని  గ్రామస్థులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details