ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

స్వీపర్​ కాళ్లు కడిగి పాదాభివందనం చేసిన ఎంపీపీ దంపతులు - వీడియో వైరల్​ - MPP Foot Salutation To Sweeper - MPP FOOT SALUTATION TO SWEEPER

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 26, 2024, 4:33 PM IST

Salutation To Sweeper in Bhadradri : తనకు ఇన్నాళ్లు సేవలందించిన ఒక స్వీపర్​కు ఓ ఎంపీపీ ఆమె కాళ్లు కడిగి పాదాభివందనం చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే అశ్వరావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి పదవీకాలం త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తుగా పదవీ విరమణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా తన కార్యాలయాన్ని శుభ్రపరుస్తూ సేవలందించిన స్వీపర్ కుమారి కాళ్లను స్వయంగా ఎంపీపీ సతీసమేతంగా కడిగారు.

వెంటనే ఆ నీటిని ఎంపీపీ దంపతులు తమ తలపై చల్లుకున్నారు. అంతేకాదు స్వీపర్ కాళ్లకు పుష్పాలతో పాదాభివందనం చేసి ఆమె దీవెనలు తీసుకున్నారు. ప్రస్తుతం ఇది ఆ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీరామమూర్తి మాట్లాడుతూ స్వీపర్ కుమారి ప్రతిరోజు ఉదయమే తన గదిని శుభ్రపరచటంతో పాటు తనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఆమె తనకు సేవలు అందించినందుకు కృతజ్ఞతగా కాళ్లు కడిగి పాదాభివందనం చేసినట్లు వివరించారు. 

ABOUT THE AUTHOR

...view details