ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై వాలంటీర్, ఫీల్డ్ అసిస్టెంట్‌పై వేటు - volunteer suspension in kadapa - VOLUNTEER SUSPENSION IN KADAPA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 23, 2024, 2:06 PM IST
MPDO Suspend Volunteer and Field Assistant For Violation Of Election Rules: ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై వాలంటీర్, ఫీల్డ్ అసిస్టెంట్‌పై వేటు పడింది. వైయస్సార్ జిల్లా కమలాపురం వైఎస్సార్సీపీ ప్రచారంలో పాల్గొన్న వారిని పెండ్లిమర్రి ఎంపీడీవో (MPDO) విధుల నుంచి తొలగించారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కుమార్తె రమ్యత రెడ్డి గోపరాజు పల్లెలో ఎన్నికల ప్రచారం (Election campaign) నిర్వహించారు. ఈ ప్రచారంలో అదే గ్రామానికి చెందిన వాలంటీర్ సుబ్బరాయుడు, ఫీల్డ్ అసిస్టెంట్ శివారెడ్డి పాల్గొన్నారు.
Election Commission Orders Violating In kamalapuram: వాలంటీర్లు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనకూడదు అని ఎన్నికల సంఘం ఆదేశాలను జారి చేసినప్పటికీ వాటిని ఉల్లంఘించి పార్టీ ప్రచారంలో పాల్గొనడం ఏమిటని టీడీపీ (TDP) మండల కన్వీనర్ గంగిరెడ్డి ప్రశ్నించారు. అనంతరం ఎంపీడీవోకు ఫిర్యాదు చేయడంతో వాలంటీర్ సుబ్బరాయుడు, ఫీల్డ్ అసిస్టెంట్ పాలగిరి శివారెడ్డిని విధుల నుండి తొలగించినట్లు ఎంపీడీవో ఉత్తర్వులు జారీ చేశారు.