LIVE: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - MP Raghurama Krishna Raju Live
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 23, 2024, 12:06 PM IST
|Updated : Feb 23, 2024, 12:36 PM IST
MP Raghurama Krishna Raju Press Meet Live: రాష్ట్రంలోని ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు వైఎస్సార్సీపీ నేతలు కానుకలు పంచుతున్నారని ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. ఈ మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు లేఖ రాశారు. వైఎస్సార్సీపీ చిహ్నాల సంచితో రెండు వేల రూపాయల నగదు, ప్రెషర్ కుక్కర్, ఫ్లాస్క్ లాంటివి ఇస్తున్నారని ఎంపీ రఘరామ తన ఫిర్యాదులో తెలిపారు. మంత్రి జోగి రమేష్ పాస్టర్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. తద్వారా మతాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్సార్సీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని లేఖలో ప్రస్తావించారు.
గత నెల సంక్రాంతి సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఓటర్లకు కానుకలు పంచారని రఘురామ తన లేఖలో వివరించారు. ఫిర్యాదుకు ప్రముఖ పత్రికలో ప్రచురితమైన కథనాలను ఆధారాలుగా జతపరిచారు. ఈ అంశాన్ని సుమోటాగా తీసుకుని విచారణ జరిపి, వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కోరారు. ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామరాజు మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం.