ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రుషికొండ ప్యాలెస్​లోకి వెళ్లలేకపోయాననే బాధ జగన్‌లో కన్పిస్తోంది- ఎంపీ కలిశెట్టి - MP Kalisetti on Rushikonda Palace - MP KALISETTI ON RUSHIKONDA PALACE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 20, 2024, 8:17 PM IST

MP Kalisetti Appalanaidu on Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్ విలాసాలను ప్రజలు ఎన్నికలకు ముందుగానే చూసుంటే వైఎస్సార్సీపీకి సింగిల్ డిజిట్ వచ్చేదని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. రుషికొండ ప్యాలెస్​లోకి వెళ్లలేకపోయాననే బాధ జగన్‌లో కన్పిస్తోందని ఆయన అన్నారు. జీవితాంతం ఉండాలని ప్యాలెస్ కట్టుకుంటే, తనకు దక్కకుండా పోయిందనే అక్కసు జగన్‌కు ఉందన్నారు. తన ఇంటి ముందు సామాన్యుడు సైకిల్ తొక్కుకుని వెళ్తున్నాడనే ఫ్రస్ట్రేషన్ ఆయనలో కన్పిస్తోందని అన్నారు. జగన్ చేసిన సంక్షేమం ప్రజల్లో ఉంటే ఓట్లు ఎందుకు వేయలేదు? సీట్లు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. జగన్ వల్లే తాము ఓడిపోయామని చాలా మంది వైఎస్సార్సీపీ నేతలు చెప్పుకుంటున్నారని కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. 

"రుషికొండ ప్యాలెస్ విలాసాలను ప్రజలు ఎన్నికలకు ముందుగానే చూసుంటే వైఎస్సార్సీపీకి సింగిల్ డిజిట్ వచ్చేది. జీవితాంతం ఉండాలని ప్యాలెస్ కట్టుకుంటే, తనకు దక్కకుండా పోయిందనే అక్కసు జగన్‌కు ఉంది. రుషికొండ ప్యాలెస్​లోకి వెళ్లలేకపోయాననే బాధ జగన్‌లో కన్పిస్తోంది." - కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎంపీ  

ABOUT THE AUTHOR

...view details